Site icon NTV Telugu

The Devil’s chair: ఏఐ టెక్నాలజీతో ది డెవిల్స్ చైర్

The Devil Chair

The Devil Chair

జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. తాజాగా ఈ సినిమా మొదటి పోస్టర్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ “సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

RG Kar rape case: సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్.. ఏం కోరిందంటే..!

హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి” అని కోరుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ “మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తి అయింది. మా చిత్రాన్ని 2025 ఫిబ్రవరి చివరి వరం లో విడుదల చేస్తాము” అని తెలిపారు.

Exit mobile version