Site icon NTV Telugu

The Delhi Files : ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ టీజర్‌కు డేట్ టూ టైం ఫిక్స్..

the Delhi Files

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నా బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయి తెలిసిందే. వాటిలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇలాంటి సంచలనాత్మక సినిమాలు తెరకెక్కించే వివేక్ రంజన్ అగ్ని హోత్రి మరొక సెన్సేషనల్ ప్రాజెక్టు ‘ది ఢిల్లీ ఫైల్స్’ తో రాబోతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ తో మరోసారి చేతులు కలిపారు వివేక్.

Also Read : Raghavendra Rao : ఆ రచయితను రాఘవేంద్రరావు ఎందుకు కిడ్నాప్ చేశారు?

రెండు భాగాలుగా రూపొందుతులన్న ఇక  మూవీ, మొదటి పార్ట్‌ ది ఢిల్లీ పైల్స్ – ది బెంగాల్ చాప్టర్ అనే టైటిల్ తో రాబోతుంది. ఇందులో భాగంగా తాజాగా బెంగాల్ చాప్టర్ టీజర్‌ను జూన్ 12న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు మెకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఓ పోస్టర్ కూడా వదిలారు. కాగా ఈ పార్ట్ 1 సెప్టెంబర్ 05, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version