NTV Telugu Site icon

Karthikeya2: పీపుల్స్ మీడియా అవార్డు విన్నింగ్ సెలెబ్రేషన్స్..

Untitled Design (8)

Untitled Design (8)

భారత ప్రభుత్వం ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అనేక మదిని నటీనటులు, అనేక సినిమాలు ఈ దఫా అవార్డ్స్ గెలుచుకున్నాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ టాలీవుడ్ నుండి అవార్డు గెలుచుకుంది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రానికి గాను తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడగా కార్తీకేయ2 ఉత్తమ చిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ శుక్రవారం హైదరాబాద్‌ లో సక్సెస్ పార్టీ నిర్వహించింది.

Also Read: Ruhani Sharma: రొమాంటిక్ సన్నివేశాలపై రుహానీ శర్మ ఎమోషనల్ నోట్..

ఈ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు చందు మొండేటి, హీరో ఆ = నిఖిల్ సిద్దార్ధ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తోపాటు అక్కినేని నాగ చైతన్య, విశ్వక్‌ సేన్‌, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సెలెబ్రేషన్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా శ్రీకృష్ణ తత్వం ఇతివృత్తంగా చందు మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ 2’ 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. త్వరలో ఈ ‘కార్తికేయ 2’కు కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ని తీసుకొస్తామని డైరెక్టర్‌ చందు మొండేటి నేషనల్‌ అవార్డ్స్‌ ప్రకటన వెలువడిన సమయంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దర్శకుడు నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ‘తండేల్‌’ తెరకెక్కిస్తున్నారు.

Show comments