Site icon NTV Telugu

Kiran Abbavaram: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన రాజావారు రాణిగారు.

Untitled Design (22)

Untitled Design (22)

టాలీవుడ్ లో మరో ప్రేమ జంట మూడు మూళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2019లో వచ్చిన రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. తొలిచిత్రంతో హిట్ సాధించడమే కాకుండా మంచి జోడి అనిపించుకున్నారు ఈ యంగ్ జంట. ఈ చిత్ర షూటింగ్ లో ఇరువురి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. అది అలా అలా పెరుగుతూ వృక్షంగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది మార్చ్ లో జరిగిన నిశ్చితార్థంతో తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా వెల్లడించారు.

Also Read: Jyothi Rai: తుంటరి చూపుతో.. చుట్టమల్లే చుట్టేస్తోన్న జగతి ఆంటీ.. ఫొటోస్ చూశారా..

తాజగా ఈ ప్రేమ జంట ఈ గురువారం (ఆగస్టు 22)న పెళ్లి పీటలు ఎక్కారు. బ్యాచ్ లర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు యంగ్ కపుల్. మూడు రోజులుగా వీరి పెళ్లి సంబరాల వీడియోలు, సంగీత్ నుంచి మెహందీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇరువురి కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వేదపండితుల సాక్షిగా రహస్య మెడలో మూడు ముళ్ళు వేసాడు కిరణ్ అబ్బవరం. కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ లో ఓ ప్రయివేట్ రిసార్ట్ లో ఈ వేడుక జరిగింది. రహస్య గోరక్, కిరణ్ రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వస్తున్న వీడియోస్, జీలకర్ర బెల్లం, కిరణ్ అబ్బవరం తాళి కడుతున్న సందర్భానికి చెందిన వీడియోలు కొన్ని రిలీజ్ చాయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

 

Exit mobile version