Site icon NTV Telugu

Tharun Bhascker : యాంకర్‌కి లైవ్‌ ఈవెంట్‌లో ప్రపోజ్ చేసిన స్టార్ డైరెక్టర్..

Tarun Baskar

Tarun Baskar

టాలెంటెడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ తాజాగా మరోసారి తన చమత్కారంతో వార్తల్లో నిలిచారు. యూట్యూబ్‌ సెన్సేషన్ అనిల్ జీలా హీరోగా నటించిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తరుణ్‌ భాస్కర్‌.. మై విలేజ్ షో టీమ్, గంగవ్వ, శ్రీరామ్ శ్రీకాంత్‌ తదితరులను అభినందిస్తూ మాట్లాడుతూ..

Also Read : Bhavana Remanna : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న హీరోయిన్.. !

‘చిన్న గ్రామం నుంచి వస్తూ ఓటీటీ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం అని కొనియాడారు. అయితే ఈ సందర్బంగా ఈవెంట్‌ను హోస్ట్ చేసిన టీవీ యాంకర్ స్రవంతి చొక్కారపు పట్ల చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. “మీరు చాలా అందంగా ఉన్నారు.. మీరంటే నాకు చాలా ఇష్టం.. నేను మీ పెద్ద ఫ్యాన్‌నే..” అంటూ ఆమెకు సరదాగా ప్రపోజ్‌ చేశారు. తరుణ్‌ ఇచ్చిన ఈ కామెంట్‌కు స్రవంతి చిరునవ్వుతో స్పందించగా, ఆ సందర్భం అక్కడున్న వారిని నవ్వులతో అలరించింది.తరుణ్ భాస్కర్ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, స్టేజ్ ప్రెజెన్స్ ఇలా ఏ రూపంలో చూసినా నేచురల్ ఛార్మ్‌ వదలదు. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీళ్ల మధ్య ఇంకేమైనా స్పార్క్ ఉంటాయా? అనేది అభిమానుల్లో ఆసక్తి గా మారుతోంది!

Exit mobile version