Site icon NTV Telugu

ఆగస్టులో తనీష్ ‘మహా ప్రస్థానం’

Thanish' Maha Prasthanam Movie to Release on August

తనీష్ హీరోగా జానీ రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహా ప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు పోషించారు. ఆగస్టులో ఈ మూవీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన రావడంతో పాటు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోందని దర్శకుడు జానీ తెలిపారు.

Read Also : “భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ట్రైలర్… చూస్తే ఒళ్ళు గగుర్పొడవాల్సిందే..!

ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, ‘ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీగా ‘మహా ప్రస్థానం’ సినిమా ఉంటుంది. ఆద్యంతం ప్రేక్షకులను ఒక మూడ్ లోకి, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం” అని అన్నారు. రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవి కాలే, ‘కేరాఫ్ కంచెరపాలెం’ రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

Exit mobile version