ఆగస్టులో తనీష్ ‘మహా ప్రస్థానం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనీష్ హీరోగా జానీ రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహా ప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు పోషించారు. ఆగస్టులో ఈ మూవీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన రావడంతో పాటు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోందని దర్శకుడు జానీ తెలిపారు.
Read Also : “భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ట్రైలర్… చూస్తే ఒళ్ళు గగుర్పొడవాల్సిందే..!
Also Read
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, ‘ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీగా ‘మహా ప్రస్థానం’ సినిమా ఉంటుంది. ఆద్యంతం ప్రేక్షకులను ఒక మూడ్ లోకి, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం” అని అన్నారు. రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవి కాలే, ‘కేరాఫ్ కంచెరపాలెం’ రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?