NTV Telugu Site icon

Thangalaan : తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. చూడాలంటే షరతులు వర్తిస్తాయ్..

Untitled Design

Untitled Design

తమిళ స్టార్ హీరో విక్రమ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన నటనతో, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ  అలరిస్తూ వస్తున్నారు. అదే ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.

Also Read : Tollywood : సోమవారం టాలీవుడ్ సూపర్ -8 స్పెషల్ న్యూస్…

ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా వచ్చిన చిత్రం తంగలాన్. అక్కడి బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే తెరపై కళ్ళకి కట్టినట్టు తెరకెక్కించాడు దర్శకుడు పా రంజిత్. ప్రస్తుతం థియేటర్లలోరన్ అవుతున్న ఈ సినిమా 25 రోజుల పూర్తి చేసుకుంది. మరోవైపు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. విడుదల అయి నాలుగు వారలు కావొస్తున్నా నేపథ్యంలో తంగలాన్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సెప్టెంబరు 27న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ లేటెస్ట్ హిట్ సినిమా. అప్పట్లో ఈ సినిమాకు ప్రీక్వెల్‌, సీక్వెల్‌ చేయడానికి చాలా ఆస్కారం ఉందని, రెండో పార్ట్‌ అయితే కచ్చితంగా ఉంటుందని. అనేక కథాంశాలతో ముడిపడి ఉన్నందున దీన్ని నాలుగు భాగాలుగా కూడా తీసుకువస్తామని అన్నారు హీరో విక్రమ్. మరి తంగలాన్ 2 ఉంటుందో లేదో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది.

Show comments