NTV Telugu Site icon

Thangalaan: మొదటి రోజే విక్రమ్ తంగలాన్ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

Thangalaan Movie

Thangalaan Movie

Thangalaan Collection Day 1: విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా తంగలాన్. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. మలయాళ నటి పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అనేకమంది ఇతర తమిళ నటీనటులు భాగమయ్యారు. కేజిఎఫ్ ఏర్పడటానికి ముందు పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ పీరియాడిక్ ఫిలిం మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. సినిమాలో టెక్నికాల్టీస్ బాగున్నాయని క్రిటిక్స్ కూడా మెచ్చుకుంటున్నారు.

National Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ నటుడిగా రిషబ్ శెట్టి

నేషనల్ సైట్స్ అన్ని ఫోర్ పైనే రేటింగ్ ఇచ్చాయంటే ఎంతలా సినిమా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలాంటి సినిమాలకు టాక్ బాగానే ఉన్నా సరే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ నిరాశ ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఈసారి ఈ సినిమాకి 26.44 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే హిందీ వర్షన్ ఇంకా రిలీజ్ చేయలేదని త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా టీం ప్రకటించింది. ఇక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా సక్సెస్ మీట్ చెన్నైలో నిర్వహించకుండానే హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించేందుకు టీం సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులో టీం థాంక్స్ మీట్ నిర్వహిస్తోంది.

Show comments