Site icon NTV Telugu

Thandel : భారీ బడ్జెట్ ఓకే.. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు బన్నీ వాసు..?

Untitled Design (26)

Untitled Design (26)

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరెకెక్కుతున్న చిత్రం తండేల్. చైతు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మింపబడుతున్న ఈ చిత్రంలో చైతు సరసన మలయాళ కుట్టి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతు,పల్లవి కాంబోలో రానున్న రెండవ చిత్రం తండేల్. గతేడాది కార్తికేయ -2 వంటి జాతీయ అవార్డు విన్నింగ్ సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి  తండేల్ చిత్రాన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు.

Also Read: Gopichand: ఒక్క హిట్టు కూడా లేని ఫ్లాప్ దర్శకుడితో.. ఫ్లాప్ హీరో సినిమా..?

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో తండేల్ కు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ నిర్మించారు మేకర్స్. చిత్రంలో శివుడికి సంబంధించిన కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్స్ లోని కొందరు ఆరిస్టులతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు నిర్మాత బన్నీ వాసు. GA -2 బ్యానర్ లో రానున్న మొదటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్ తండేల్. దాదాపు 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ పై ఆధారపడి ఉంది. రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 20న వస్తే తండేల్ వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ రాకుంటే క్రిసమస్ కానుకగా తండేల్ ను తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఉత్తరాంధ్రకుం చెందిన కొందరు జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర భాగంలో చిక్కుకుని అక్కడ ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి అనే కథాంశంతో వస్తోంది తండేల్.

Exit mobile version