టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ పూర్తి యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా తో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుండగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Also Read : Rajasab : ‘ది రాజాసాబ్’ సినిమాలో సడెన్ ట్విస్ట్..!
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ రైట్స్ ను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ రేటుకు ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రన్ తర్వాత ‘తమ్ముడు’ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతున్నాడు. ఇక పోతే నితిన్ కెరీర్‌కు ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. రీసెంట్ గా ‘రాబిన్ హుడ్’ మూవీతో వచ్చినప్పటికీ అది ఉహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ప్రమోషన్ కూడా జోరుగా చేసినప్పటికి లాభం లేకుండా పోయింది. అందుకే ‘తమ్ముడు’ మూవీ ప్రమోషన్స్ లో కాస్త సైలెంట్ అయ్యారు. మరి చూడాలి నితిన్‌కు ఈ చిత్రం ఎంత వరకు హిట్ ఇస్తుందో.
