NTV Telugu Site icon

Thalapathy Vijay : గోకుల్ థియేటర్లో ‘సలార్’ చూసిన తమిళ హీరో విజయ్.. ఇదిగో సాక్ష్యం..

Untitled Design (23)

Untitled Design (23)

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా భాషలలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కింది సలార్. గతేడాది రిలీజ్ అయిన సలార్ అద్భుతమైన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు సలార్ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే..

Also Read : Big Boss8: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ డిష్యుం..డిష్యుం.. శేఖర్ బాషా vs సోనియా

తాజగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ G.O.A.T చిత్ర ప్రమోషన్స్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ను హైదరాబాద్ లోని ఓ మాస్ థియేటర్లో మాస్ ఆడియన్స్ మధ్య చూసారని తెలిపాడు. దింతో ఒక్కసారిగా వైభవ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విజయ్ ఏ థియేటర్లో చూసాడా అని ఆరా తీయగా హైదరాబాద్ ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ లో విజయ్ సలార్ ని చూసినట్టు ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. మేము విజయ్ ను చూశాము కాని ఆయన గోప్యత కారణంగా వారు మమ్మల్ని ఎటువంటి సమస్య చేయవద్దని కోరడంతో, మేము ఇళయదళపతి విజయ్ గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉన్నందున మేము ఎవరికీ అప్పుడు సినిమా చూస్తున్న ఎవరికీ ఆ విషయం చెప్పలేదని తెలిపాడు. విజయ్ ఇలా ఎందుకు చూశాడని వైభవ్ ని ప్రశించగా టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ మధ్య సినిమా చూస్తే వచ్చే ఎక్స్ పీరియన్స్ కోసమే చూసారని వైభవ్ సమాధానం ఇచ్చాడు. గోకుల్ థియేటర్లో విజయ్ సినిమా చూస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.

Show comments