తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ రిలీజ్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందాన తెచుకుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సీనియర్ హీరో ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో కనిపించారు. AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
Also Read: Lucky Star : హిట్లు నిల్.. ఆఫర్లు ఫుల్.. రెండు సినిమాలు స్టార్ట్ చేసిన యంగ్ హీరో
భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య దాదాపు 5000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన గోట్ మొదటి రోజు భారీ ఓపెనింగ్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 126.32 కోట్లు రాబట్టింది. రెండవ రోజు, మూడవ రోజు కలిపి ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఓకే సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు. 8 సార్లు 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని విజయ్ కెరీర్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇది వరకు విజయ్ నటించిన మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు, లియో సినిమాలు రూ. 200 కోట్లు గ్రాస్ రాబట్టాయి. ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఈ మార్క్ ను మరోసారి అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసాడు విజయ్. విజయ్ తో పాటు ఈ రికార్డును తలైవా రజనీకాంత్ 8 సినిమాలు, టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రూ. 200 కోట్లు కలిగిన 8 సినిమాలు ఉన్న హీరోగా రికార్డు నమోదు చేసాడు.