తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు ఈ సినిమాలో విజయ్ కూతురిగా కనిపించబోతుంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దళపతి కచేరి అని రిలీజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ను ఊపేస్తోంది. విజయ్ డాన్స్ కు ఫ్యాన్స్ విజిల్స్ కొడుతున్నారు. ఈ పాటను అనిరుధ్ కలిసి విజయ్ పాడడం విశేషం. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల జరిగిన పరిణామాలతో డీలా పడిన విజయ్ ఫ్యాన్స్ ఈ సాంగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సాంగే వినిపిస్తుంది. బాలయ్య నటించిన సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అవుతోంది. కానీ తెలుగులో రెబల్ స్టార్ నటించిన పాన్ ఇండియా బిగ్గెస్ట్ సినిమా రాజాసాబ్ తో పాటు పోటీగా రిలీజ్ అవుతోంది.
