చిత్ర పరిశ్రమను వేధిస్తున్న సమస్యలో లీకులు ఒకటి.. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సీక్రెట్ కెమెరాలతో చిరించి పలువురు తమ వ్యూస్ కోసం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి రీపీట్ కావడం దురదృష్టకరం. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేదు.. హీరోల షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ లీకుల రాయుళ్లు ప్రత్యేక్షమైపోతున్నారు.. తాజాగా విజయ్, రష్మిక నటిస్తున్న తలపతి 66 కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జర్పుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట ప్రత్యేక్షమయ్యాయి. హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్, రష్మికలకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది.
ఇక ఈ ఫోటోలలో విజయ్ క్యాజువల్ డ్రెస్ వేసుకోగా, రష్మిక అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించింది. ఇక రోడ్డుపక్కనే షూటింగ్ జరుగుతుండడంతో వాహనదారులు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఇక ఇటీవల కూడా ఈ సినిమాలోని కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.. ఖుష్బూ, విజయ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గా కనిపిస్తున్నాయి. ఇక ఈ లీకులను చూసి వంశీ పైడిపల్లి అప్‌సెట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఎంత కంట్రోల్ చేసినా ఈ లీకులను ఆపడం కుదరడంలేదను, విజయ్ లుక్ బయటికి తెలిసిపోవడంతో వంశీ కొంచెం కంగారు పడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ లీకులను ఆపడానికి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.