విజయ్ సేతుపతి హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్‌గా నటించిన తలైవాన్ తలైవి అనే తమిళ సినిమా ఈ రోజు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. వివాహ వ్యవస్థ మీద రూపొందిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి హిట్ టాక్ సంపాదించడమే కాకుండా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతోంది.
Also Read:Sandeep Reddy Vanga: ‘ఇచ్చట సినిమాలు’ ప్రమోట్ చేయబడును!
ఈ సినిమాను వాస్తవానికి సార్ మేడం పేరుతొ ఈ రోజే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ హరిహర వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల కొరత ఉంటుందనే ఉద్దేశంతో సినిమాను రిలీజ్ చేయలేదు. అయితే, తమిళంలో సూపర్ హిట్ టాక్ రావడంతో, సినిమాను వచ్చే శుక్రవారం నాడు, అంటే ఆగస్టు ఒకటో తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో యోగి బాబు సహా ఇతర తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాను సేందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా సత్య జ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మించారు. టి.జి. త్యాగరాజన్ సమర్పించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
