Site icon NTV Telugu

Komatireddy : సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Komati Reeddy

Komati Reeddy

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప -2.డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ ను ఒకరోజు ముందుగా భారీ ఎత్తున ప్రదర్శించారు. ముఖ్యంగా తెలంగాణా వ్యాప్తంగా అన్నిసింగిల్ స్క్రీన్స్ లో రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే ఈ ప్రీమియర్ కు అల్లు అర్జున్ యూనిట్ తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా ఉంది.

Also Read : Rapo22 : మీలో ఒకడు సాగర్.. రామ్ పోతినేని ఫస్ట్ లుక్ సూపర్బ్

ఈ దుర్ఘటనపై తెలంగాణ పోలిసులు అటు అల్లు అర్జున్ పై అలాగే థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేసారు. మరోవైపు ఈ సంఘటనపై స్పందించారు తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయన మాట్లాడూతూ ‘ ఇక నుండి తెలంగాణ లో బెనిఫిట్ షోస్ కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వం. ఎంతటి భారీ బడ్జెట్ సినిమా అయినా సరే ఉదయం ఆట నుండి షోస్ వేయాలి అని అన్నారు. ఇక టాలీవుడ్ లో రాబోయే స్టార్ హీరోల సినిమాలకు ఈ నిర్ణయం ఓ గట్టి దెబ్బ అనే చెప్పాలి. కానీ సినిమాల కంటే ప్రజల శ్రేయస్సు ముఖ్యం అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి రానున్న గేమ్ చెంజార్, డాకు మహారాజ్ ఇక బెన్ఫిట్ షోలు,ప్రీమియర్స్ లేనట్టే.

Exit mobile version