Site icon NTV Telugu

‘కళామతల్లి చేదోడు’ 600 మంది సినీ వర్కర్స్ కు చేయూత!

TFI Producers Help To 600 Cine Workers During Covid-19

ప్ర‌ముఖ‌ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో “కళామతల్లి చేదోడు” కార్యక్రమం ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, అజయ్ కుమార్, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యలమంచిలి రవి చంద్ మాట్లాడుతూ ‘ప్రస్తుత కష్ట కాలంలో ప్రతి పేద సినిమా కార్మికుడు, కార్మికురాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారందరినీ ఆదుకోవాలని “కళామతల్లి చేదోడు” కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు వేల మంది సినీ వర్కర్స్ వున్నారు. ఇప్పుడు వారందరికీ ఓకే సారి గ్రాసరీస్ పంపిణీ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించి కోవిడ్ కారణాల దృష్టా ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 600 మందికి పేద కార్మికులకు మొదటి విడతగా ఫుడ్ గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా దశల వారిగా ఫుడ్ గ్రాసరీస్ అందచేస్తాం’ అన్నారు.

Exit mobile version