NTV Telugu Site icon

TFCC : ఘనంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

Tfc

Tfc

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘ ఈ రోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం.  మా తెలంగాణలో ఉండే కొందరు బడా నిర్మాతలు మంత్రి గారి పి ఏ లకు ఫోన్ చేసి మంత్రిగారిని ఫంక్షన్కు రాకుండా చూసుకోండి అని చెప్పారు, అయినా ఎవ్వరిని లెక్కచేయకుండా మంత్రిగారు మా ప్రోగ్రాంకు రావడం నిజంగా చాలా చాలా సంతోషం. రావడమే కాదు మేము అడిగిన కోరికలన్నీ తీరుస్తానని చెప్పారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.

Also Read : Sivakarthikeyan : అమ’రన్’ ఇప్పట్లో ఆగేలా లేదు.. టార్గెట్ రూ. 300 కోట్లు

సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఆరోసారి ఛైర్మన్ గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.  చిత్ర పరిశ్రమ ఎవరో ఐదారుగురు పెద్ద వారిదే కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదీ.  మా భూమి నుంచి మొన్నటి బలగం వరకు తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. నా దగ్గరకు థియేటర్స్ ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న సినిమా వారికి నా సహకారం అందిస్తున్నా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తాం. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ లో మన తెలంగాణ సినిమా వారికి ఫ్లాట్స్ ఇప్పిస్తాం’ అని అన్నారు.