Site icon NTV Telugu

తలసాని శ్రీనివాస యాదవ్ కు టి.ఎఫ్‌.సి.సి. సత్కారం

TFCC Felicitation to Cinematography Minister Talasani Srinivas Yadav

థియేటర్ల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీల అమలు తదితర అంశాలపై ఓ స్పష్టతను కోరతూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ), ఎగ్జిబిటర్స అసోసియేషన్‌ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. అయితే టీఎఫ్‌సీసీ, ఎగ్జిబిటర్స్‌ల అభ్యర్ధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొన్ని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు మార్గం మరింత సుమగం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ స‌భ్యులు, తెలంగాణ థియేటర్‌ ఓనర్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్ స‌భ్యులు త‌మ‌ సమస్యలను పరిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిసి స‌త్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : ఆగస్ట్ 14న అమెజాన్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’

Exit mobile version