Teser Launch : ప్రముఖ దర్శకుడి చేతుల మీదుగా “మహీష” టీజర్ లాంఛ్
- ఘనంగా "మహీష" టీజర్ లాంఛ్
- త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
- ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహీష టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మహీష సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ – మహీష సినిమా టీజర్ బాగుంది. సాంగ్స్ లోని సంగీతం, సాహిత్య విలువలు ఆకట్టుకున్నాయి. మహిళల మీద దాడులు ఎలా ఆపగలం అనే కాన్సెప్ట్ తో చేసిన చిత్రమిది. ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ చిత్రాన్ని రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఈ చిత్రం మంచి విజయం సాధించి, సినిమా హీరో కమ్ డైరెక్టర్ ప్రవీణ్, ఇతర టీమ్ అందరికీ గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
Also Read
- Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
- Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రామకృష్ణ మాట్లాడుతూ – చిన్న చిత్రాలు ఈ మధ్య కాలంలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజైన చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మహీష సినిమా కంటెంట్ చాలా బాగుంది. టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని ఆశిస్తున్నా’ అని అన్నారు.
దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి. మాట్లాడుతూ – మహీష సినిమా టీజర్ లాంఛ్ కు అతిథిగా వచ్చిన మా ఫేవరేట్ డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ గారికి థ్యాంక్స్. ఆయన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా అందరినీ ఇప్పటికీ అలరిస్తుంటుంది. మహీష సినిమా ఈ రోజు మహిళల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంతో రూపొందించాము. ధర్మాన్ని ఎలా కాపాడాలనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ ఎంతో శ్రద్ధతో మ్యూజిక్ చేశారు. సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. ఈ సినిమాకు సీక్వెల్ గా యధా యధా హి ధర్మస్య అనే సినిమా చేయబోతున్నాం. అన్నారు.
తాజావార్తలు
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!