Site icon NTV Telugu

Sogasu Choodatarama: సిద్ధు జొన్నలగడ్డ కోసం రంగంలోకి నయనతార

Sogasu Chuda

Sogasu Chuda

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెలుసు కదా ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇది సిద్దూ, రాశీ ఖన్నా అలరించిన క్లాసిక్ లవ్ నంబర్. ఈ రోజు సిద్దు, శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్ సింగిల్ సొగసు చూడతరమా సాంగ్ ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి S థమన్ సంగీతం అందించారు.

Also Read :National Film Awards Ceremony: ఘనంగా నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం..

సాయంత్రం ముగిసే సమయానికి సిద్ధూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, శ్రీనిధి తన వాచ్ సమయాన్ని రీసెట్ చేస్తుంది, ఆమె ఇంకా వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా లేదని చూపించే సైన్ ఇది. ఈ ట్రాక్‌తో థమన్ మరో అద్భుతమైన కంపోజిషన్ అందించాడు. బాస్‌లైన్, డ్రమ్‌బీట్, ట్రంపెట్ పాటకు రెట్రో వైబ్‌ను ఇచ్చింది. కార్తీక్ వోకల్స్ పాటకు డెప్త్, ఎమోషన్ ని యాడ్ చేసింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ అమ్మాయి పట్ల సిద్ధు ఎమోషన్స్ ని అందంగా ప్రజెంట్ చేస్తోంది.

Also Read :They Call Him OG: ఓజీ డిస్ట్రిబ్యూషన్ ఒక టార్చర్.. యూరప్ డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన

విజువల్స్ సాంగ్ కు మరింత బ్యూటీ యాడ్ చేశాయి. సిద్ధు, శ్రీనిధి మధ్య మెరిసే కెమిస్ట్రీ అదిరిపోయింది. సిద్ధు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ ఆకట్టకున్నాయి. వైరల్ ట్యూన్, అద్భుతమైన విజువల్స్‌తో, ఈ పాట నేరుగా మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లోకి వెళ్ళింది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పాటల చార్ట్ బస్టర్ హిట్స్ కావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version