Site icon NTV Telugu

యాంకర్ ప్రదీప్ కు కరోనా …?

Telugu TV host Pradeep Machiraju tests positive for COVID-19

ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రదీప్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడట. అయితే ప్రదీప్ ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు. ఇటీవలే ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్న ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్’ ముగిసింది. ఆ తరువాత ప్రదీప్ ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’కు వ్యాఖ్యాతగా చేశాడు. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అయితే అందులో ప్రదీప్ కన్పించలేదు. పైగా ప్రదీప్ స్థానంలో యాంకర్ రవి కనిపించడంతో ఈ పుకార్లకు బలం చేకూరినట్టయ్యింది. ఇక ‘డ్రామా జూనియర్స్ 5’కు రేణు దేశాయ్, సునీత, ఎస్వీ కృష్ణారెడ్డి జడ్జిలుగా ఉన్నారు. మరోవైపు గత ఏడాది కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి పలువురు బుల్లితెర ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నవ్య స్వామి, రవికృష్ణ, ప్రభాకర్, సాక్షి శివ, భరద్వాజ్, మాళవిక, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తదితరులు కరోనా సోకినవారి జాబితాలో ఉన్నారు.

Exit mobile version