Telugu TV, Digital & OTT Producers Council : ఏకగ్రీవంగా టిటిడిఓపిసి నూతన కార్యవర్గం ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025– 2027వ సంవత్సరానికి గాను ‘‘తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’’ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా ఏ.ప్రసాదరావు (సోనోపిక్స్ ప్రసాద్) వైస్ ప్రెసిడెంట్‌గా పి.ప్రభాకర్, యన్.అశోక్‌లు ఎన్నికవ్వగా జనరల్ సెక్రటరీగా యం.వినోద్‌బాల జాయింట్ సెక్రటరీలుగా నటుడు–నిర్మాత కె.వి శ్రీరామ్, గుత్తా వెంకటేశ్వరరావు, ట్రెజరర్‌గా డి.వై చౌదరి ఎన్నికయ్యారు. గత 14 ఏళ్లుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ సభ్యులకు ఉపయోగపడే విధంగా మంచి పనులు చేసి అందరితో శహభాష్ అనిపించుకునే ఏకైక యూనియన్ మాది అని ప్రెసిడెంట్ ప్రసాద్‌రావు అన్నారు. ఎటువంటి ఎన్నికల హడావిడి లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఏకగ్రీవంగా తమ సభ్యులను ఎన్నుకుంటున్న ఏకైక యూనియన్ మా టిటిడిఓపిసి సంస్థ అన్నారు జనరల్ సెక్రటరీ వినోద్‌బాల. ఈ కౌన్సిల్‌లో దాదాపు 200 మంది నిర్మాతలు ఉన్నారు.
Also Read:Kantara Chapter 1 Trailer: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
అందరూ యాక్టివ్‌గా ఉంటూ వందలమందికి ఉపాధి కల్పించటంలో అనేక యూనియన్ల కంటే సౌతిండియాలోని అతి పెద్ద సంస్థ మాది అన్నారు నటుడు–నిర్మాత ఈటీవి ప్రభాకర్. మా యూనియన్‌కి సొంత భవనంతో మరి కొన్ని స్థిరాస్తులు ఉండటంతో మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మా యూనియన్ సభ్యులు అన్నారు ట్రెజరర్ డి.వి చౌదరి. మా యూనియన్ సభ్యులకి ఎటువంటి ఆపద వచ్చిన మేమందరం కలిసి కట్టుగా మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటామని అందుకే మాలో మాకు పెద్దగా వివాదాలు ఉండవని అన్నారు నటుడు– నిర్మాత కె.వి శ్రీరామ్. వీరితో పాటు హానరబుల్ ఎడ్వైజర్‌గా కె.రమేష్ బాబుని నియమించటం జరిగింది. నూతన కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీస్‌గా కెవి.కిరణ్ కుమార్, స్వాతి కె బాలినేని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా యాటా. సత్యనారాయణ, వి.వెంకటేశ్వరరావు, జి.తాండవకృష్ణ, అనిల్ కడియాల, పి.ప్రేమ్‌సాగర్, పద్మిని నాదెళ్ల, కో–ఆపరేటడ్ మెంబర్స్‌గా హెచ్.శ్రీనివాస్, ఎస్.సర్వేశ్వర్ రెడ్డి, కొల్లి ప్రవీణ్ చంద్ర, కె.భరత్‌కుమార్‌లు ఎన్నికయ్యారు. మన టీవి సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి విపత్తులు సంభవించిన మేమందరం కలిసి పనిచేస్తామని 2011లో ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉంటూ ఎంతోమందికి మేలు చేసిన దాసరి నారాయణరావు గారి సమక్షంలో ఏర్పడిన యూనియన్ మాది. ఆయన గుర్తుగా మరిన్ని మంచి కార్యక్రమాలతో మా కార్యవర్గం ముందుకు సాగే విధంగా ఉంటుందని మేమందరం మాట ఇస్తున్నాం అని మీడియా సమావేశంలో మాట్లాడారు ‘‘తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’’ సభ్యులు. తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!