విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా ‘దృశ్యం2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్త టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట చిత్ర బృందం.కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పుడు కరోనా మరింత వ్యాపిస్తుండటంతో తెలుగులో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా ఓటీటీ లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఓటీటీలో ‘దృశ్యం2’!
