NTV Telugu Site icon

Hansika : నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సీనియర్ నటి కుమార్తె హవా

Prashanttini Shekar

Prashanttini Shekar

అదేంటి హీరోయిన్ హన్సిక అనుకుంటున్నారా? కాదు కాదు ఈ హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేసింది. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచింది హన్సిక. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడగా పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూ. టీన్ విజేతగా నిలిచారు. ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా ఆమె కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకుందని చెప్పొచ్చు.

Seize the Ship: ‘సీజ్ ద షిప్’ క్రేజ్.. ఏకంగా సినిమా?

ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచింది హన్సిక. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూ. మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు. హన్సిక స్వస్థలం వనపర్తి కాగా తండ్రి శేఖర్. హన్సిక తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి కూడా. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురే ఈ హన్సిక.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు హన్సిక వెల్లడించింది. చదువులో ఉన్నతస్థాయి లో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.

Show comments