NTV Telugu Site icon

Telugu Film Industry : సినీ కార్మికుల డిమాండ్లు ఇవే..

Telugu Film Industry Logo

Telugu Film Industry Logo

తమ వేతనాల కోసం ఫెడరేషన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ రోజు నుంచి షూటింగ్స్ కు కార్మికులు ఎవ్వరూ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఫెడరేషన్ లో వున్న 24క్రాప్స్ కు సంబంధించిన కార్మికులు సమ్మె బాట పట్టారు. ఫెడరేషన్ లో 24 క్రాఫ్ట్స్ వుంటాయి..మొత్తం సభ్యులు దాదాపుగా 20,000 మంది వరకు వుంటారు. సభ్యత్వం లేని వారు ఇంకొక 3 వేలు మంది వరకు వుండొచ్చు అని అంచనా. సమ్మె జరిగితే నష్ట పోయే సినిమాలు చాలానే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా ప్రభాస్ ప్రాజెక్ట్ కే శంకరపల్లిలో జరుగుతుంది. చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమా పఠాన్ చేరు పాశ మైలారం దగ్గర విజయ్ ఎలక్రికల్స్ లో జరుగుతుంది. విజయ్ దేవరకొండ సమంత నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది. రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అల్లరి నరేష్ ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న ఇట్లు మారేడు మిల్లీ ప్రజానీకం సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. వీటితో పాటు బాలీవుడ్‌ సినిమాలు.. సల్మాన్ ఖాన్, వెంకటేష్ కభి ఈద్ ఖభి దివాలి సినిమా షూటింగ్ కోకాపేట్ లో జరుగుతుంది. అజయ్ దేవగన్ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. అంతేకాకుండా ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సార్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. శివ కార్తికేయన్ సినిమా నానక్ రామ్ గుడా లో జరుగుతుంది. సీనియర్ అర్జున్ సినిమా హైదరాబాద్ లో జరుగుతుంది.

షూటింగ్ త్వరలో జరుపుకోబోయే సినిమాలు:

ప్రభాస్ సాలార్ కోసం శంషాబాద్ లో సెట్ వేసారు ఆ షెడ్యుల్ జూలై మొదటి వారం నుంచి జరుగనుంది. షారుఖ్ ఖాన్ జావాన్ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేశారు జూలై ఫస్ట్ నుంచి షెడ్యుల్ జరుగనుంది.
విజయ్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో నటిస్తున్న వారసుడు అన్నపూర్ణ 7ఎకర్స్ లో సెట్ వేసారు జూలై మొదటి వారం నుంచి షెడ్యుల్ ప్రారంభం కానుంది. అజిత్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో సెట్ వేసారు జూలై మొదటి వారం నుంచి షూటింగ్ జరుగునుంది. నాని దసరా సినిమా షూట్ కోసం బాచుపల్లిలో సెట్ వేసారు ఈ నెలాఖరు నుంచి షెడ్యుల్ మొదలు కానుంది. దాదాపు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి 25 వరకు షూటింగ్ దశలో వున్నాయి. ఈ షూటింగ్స్ లో దాదాపు 5వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఈ సమ్మె ప్రభావం ఈ సినిమాలపై పడనుంది.

ఇండస్ట్రీకి ఎంత నష్టం : ఒక పెద్ద హీరో షూటింగ్ కి నార్మల్ గా అయితే దాదాపు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఓ రేంజ్ హీరో సినిమా షూట్ కి నిర్మాతలు 50లక్షలు వరకు ఖర్చు అవుతుంది. మినిమం రేంజ్ హీరో సినిమాలకు 20నుంచి 30లక్షల వరకు ఖర్చు అవుతుంది.

కార్మికుల డిమాండ్స్ : వేతనాలు పెంచాలి అని ఆరు నెలలుగా ఛాంబర్ ను అడుగుతుంటే పట్టించుకోవడం లేదు అని ఫెడరేషన్ సభ్యులు చెపుతున్నారు.

నిర్మాతలు చెపుతున్నది: కరోనాతో మేము కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము ఇపుడిపుడే గాడిన పడుతుంది కొంచెం టైం కావాలి అని నిర్మాతలు అంటున్నారు. పని వచ్చిన వారికి పని రాని వారికి కూడా ఒకటే రెమ్యునరేషన్ ఇది చాలా ఘోరమని నిర్మాతలు అంటున్నారు. 24క్రాఫ్ట్స్ లో ఒక్కొక్క క్రాఫ్ట్ లో ఒక్కొక్క వేతన స్కేల్ వుంటుంది. ఉదాహరణకి ఫైటర్స్ ను తీసుకుంటే వాళ్లకు ఒక ప్యాకేజీ మూడు రోజుల ప్యాకేజీకి వాళ్లకు 7500 ఇవ్వాలి నిర్మాత ఒక్కరోజు పని చేయించుకున్న మూడు రోజులు పని చేయించుకున్న 7500 ఇవ్వాల్సిందే…ఇలాంటి విషయాలను నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. ఎలక్ర్టిషియన్ కి రూ.1500, మేకప్ మెన్ కి రూ.1500, జూనియర్ ఆర్టిస్టులకు రూ.800, ఈ విధంగా 6to6 12 గంటలకు పే స్కేల్ వుంటుంది. 12 గంటలు దాటితే మళ్ళీ వేరే కాల్ షీట్ కు నిర్మాత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. షూటింగ్ లకు సభ్యత్వం వున్న వారు కాకుండా లేని వారిని తీసుకొచ్చి వాళ్లకు కూడా అదే రేటు వసూల్ చేస్తున్నారు అని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని వచ్చిన వాళ్లకు డబ్బులు ఇవ్వొచ్చు కానీ పని రాని వారికి కూడా అదే పే స్కేల్ ప్రకారం ఇవ్వమంటే ఎలా అని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. పని చేస్తున్న కార్మికులు నిర్మాతలు ఇండస్ట్రీలో హ్యాపీగా లేరు..కేవలం ఏజెంట్స్ మాత్రమే నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తూ బతికేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘వందమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి అంటే ఏజెంట్ ముప్పై మందిని సభ్యత్వం వున్న వాళ్ళను తీసుకొచ్చి మిగతా 70 మంది నీ సభ్యత్వం లేని వాళ్ళను తీసుకొస్తాడు కొత్త వాళ్లకు నిర్మాతల దగ్గర తీసుకొనే దానికన్నా ఇంకా సగానికి సగం ఇస్తారు మిగతా డబ్బులు ఏజెంట్లు జేబుల్లోకి వెళ్తాయి. అలాగని ఏజెంట్స్ నీ ఏమైనా అంటే వెంటనే షూటింగ్ నీ ఆపేస్తారు.. దీనివల్ల నిర్మాతకు నష్టం అందుకే వాళ్ళతో రాజీ చేసుకొని షూటింగ్ పూర్తి చేస్తారు. ఏజెంట్స్…. ఫెడరేషన్ నాయకులుగా చలామణి అవుతున్నారు దాని వల్ల నిర్మాతలను భయ పెడుతున్నారు’ అని ఓ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క ఫెడరేషన్ సభ్యులు కూడా నిర్మాతల వైఖరిని తప్పు పడుతున్నారు. 20 కోట్లు బడ్జెట్ అని ముందు అనుకొని స్టార్ట్ చేస్తే ఆ హీరో వల్లో డైరెక్టర్ సలహా మేరకో బడ్జెట్ ను రెండు మూడు రెట్లు పెంచేస్తున్నారు దాని వల్ల పని భారం ఎక్కువవుతుంది కాల్ షీట్స్ పెరుగుతున్నాయి దీని వల్ల ఒప్పుకున్న సినిమాలు కొన్ని వదిలేయాల్సి వస్తుంది.. దీంతో ఆ సినిమా హిట్ అయితే పని వస్తుంది లేకపోతే ఒక్కరూ పిలవరు దీంతో నెలలు తరబడి ఖాళీగా వుండాల్సి రావచ్చు. 6 టు 6 అనుకున్న టైం దాటి వర్క్ చేస్తూ వుంటాము ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము అంటారు కానీ ఇవ్వరు. గట్టిగా అడిగితే ఆ బ్యానర్ లో మళ్ళీ పని దొరకదు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వున్నాయి అని ఫెడరేషన్ సభ్యులు చెపుతున్నారు.