Site icon NTV Telugu

SahaKutumbhanam: ఆసక్తి రేకెత్తించేలా ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ “స:కుటుంబానాం” టీజర్.

Sahakutumbhanam

Sahakutumbhanam

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పవచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీని హేట్ చేస్తూ కనిపించే ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులను అలరించబోతున్నారు.

Also Read : Dhanush: మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ బాసూ!

ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం గారి హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్ సృష్టిస్తారు నడిపించేలా తన ప్రెసెన్స్ & పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్ అనిపిస్తుంది. టీజర్ లోని సంగీతం చాలా బాగుంది. త్వరలోనే విడుదల అవనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి తెలుగింటి భోజనం అందించనుందని మేకర్స్ చెబుతున్నారు.

Exit mobile version