Site icon NTV Telugu

Tollywood: నటితో దర్శకుడి ప్రేమాయణం.. గుర్తు తెలియని నెంబర్తో లీకులు

Illegal Affair

Illegal Affair

గత పది రోజులుగా తెలుగు సినీ జర్నలిస్టులు అందరికీ ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది.. ఆ మెసేజ్ సారాంశం ఏమిటంటే తెలుగులో ఒక మంచి పేరు ఉన్న దర్శకుడు ఒక నటితో ప్రేమాయణం సాగిస్తున్నాడట. తన భార్యను మోసం చేసి మరి ప్రేమాయణం సాగిస్తూ ఉండడంతో ఆయన భార్యకు న్యాయం చేయాలంటూ ఈ మెసేజ్ గత పది రోజులుగా చిన్నాచితక తేడా లేకుండా సినిమా బీట్ చూసే జర్నలిస్టులతో పాటు డెస్క్ లో ఉన్న వారికి సైతం అదే నెంబర్ నుంచి మెసేజ్ లు వస్తున్నాయి అయితే ఆ మెసేజ్ పూర్తిస్థాయిలో తెలుగులోనే ఉన్నా ఎక్కడి నుంచో ట్రాన్స్లేట్ చేసి డంప్ చేసినట్లుగా అనిపిస్తోంది.

Allu Arjun: త్రివిక్రమ్ బన్నీ స్టోరీలైన్ లీక్.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!

సదరు డైరెక్టర్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత మరో సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక డిజాస్టర్ దెబ్బకు దూరమైన ఆయన తర్వాత ఈ మధ్యనే రియంట్రి ఇచ్చినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఆ రీఎంట్రీ సినిమాలో నటించిన నటితో సదరు దర్శకుడు ప్రేమాయణం సాగిస్తున్నాడు అంటూ మీడియా వారికి మెసేజ్లు పంపడం హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఎవరు పంపుతున్నారు? ఎందుకు పంపుతున్నారు? అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సదరు నటి లేదా సదరు దర్శకుడిని బ్యాడ్ చేసే ఉద్దేశమైతే కనిపిస్తోంది.

Exit mobile version