Site icon NTV Telugu

Vallabhaneni Anil: రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు?

Tollywood Straik

Tollywood Straik

సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశం గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశం మీద సినీ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిన్న మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఛాంబర్‌తో చర్చల కోసం వేచి ఉన్నామని, ఫెడరేషన్ తరఫున లేఖ ఇవ్వమని ఛాంబర్ కోరగా, ఆ లేఖను సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.

Also Read : Coolie : ‘కూలీ’ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్.. కారణమేంటి?

రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు జరపనున్నట్లు తెలిపింది. ఈ చర్చలు ఫలవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అనిల్. పరిశ్రమలోని అన్ని సమస్యలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్మికుల పని పరిస్థితులపై ఫెడరేషన్ ఒకే వైఖరిని కొనసాగిస్తుందని, టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే, తమ సమస్యల కోసం తాము కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని అనిల్ అన్నారు.

Also Read : Breaking : కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కానున్న నిర్మాతలు..

రేపటి సమావేశంలో ఛాంబర్ పెద్దలు, నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు అందరూ పాల్గొననున్నారు. మంత్రి కూడా ఫెడరేషన్ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తున్నారని అనిల్ తెలిపారు. ఈ చర్చల తర్వాత సినీ పరిశ్రమ సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version