Teliyadu Gurtuledu Marchipoya: “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా” అంటే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నివాస్, అమిత శ్రీ జంటగా “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా” అనే సినిమా తెరకెక్కుతోడి. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం వంటి వారు నటిస్తున్నారు. చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్న ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ మంచి కథ, కథనాలతో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా మీ ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశా, ఈ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్లనే పర్పెక్ట్ గా కాస్టింగ్ చేశారు. నిర్మాత శరత్ చెన్నా గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఎంతో ప్యాషన్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ ఈ మూవీని అనేక ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఎంటర్టైనింగ్ గా రూపొందిస్తున్నాడు అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం అని అన్నారు. హీరోయిన్ అమిత శ్రీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉందని అన్నారు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!