తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు చిక్కుల్లో పడ్డాడు. నిన్న హీరోయిన్ అన్షు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. త్రినాథ రావు వ్యాఖ్యలను సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించినట్లు చైర్మన్ నేరేళ్ల శారద తాజాగా వెల్లడించారు. త్రినాథ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద అన్నారు. నిన్న జరిగిన మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ హీరోయిన్ అన్షు గురించి సంచలన కామెంట్స్ చేశారు.
Manchu Vishnu: 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు
ముందుగా ఆయన మాట్లాడుతూ మన్మధుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుంది అంటూనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అన్షు ఫారెన్ నుంచి వచ్చాక సన్నగా ఉందని, కాదమ్మా తెలుగుకు సరిపోదు, కొంచెం అన్నీ ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా, పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చర్చ మొదలైంది. ఆయన మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇక ఈ విషయం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఆయన చిక్కుల్లో పడ్డట్టు అయింది.