Site icon NTV Telugu

Telangana Telivision Awards 2024: కమిటీ ఛైర్మన్‌గా శరత్ మరార్

Go

Go

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్‌ 2024’ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డుల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి నియమించిన ఈ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి ప్రముఖ నిర్మాత శరత్ మరార్‌ను ఛైర్మన్‌గా నియమించారు.
దీనికి కన్వీనర్ TGFDC MD.

Also Read : ENE Repeat : సురేష్ బాబుకి ఏమైంది?

ఇక టెలివిజన్ పరిశ్రమ నుండి కె. బాపినీడు, మంజుల నాయుడు, పి. కిరణ్ వంటి ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ ప్యానెల్‌కు అవార్డుల ఫ్రేమ్‌వర్క్ మరియు విజన్‌ను రూపొందించే బాధ్యతను అప్పగించారు. అన్ని విభాగాలలో పారదర్శకత, సమగ్రత, సృజనాత్మక నైపుణ్యాన్ని నిర్ధారించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ సినీ, టెలివిజన్‌ రంగాల్లో కేంద్రంగా ఎదుగుతోంది. ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్‌ 2024’ ద్వారా స్థానిక సృజనాత్మక ప్రతిభను గౌరవించే వేదికను అందిస్తున్నాం,” అని ఆయన పేర్కొన్నారు. “ఇది సృజనాత్మకతను, స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక.” అని ఆయన అన్నారు .

Exit mobile version