NTV Telugu Site icon

Jani Master Case : జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు

Jani Master

Jani Master

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కొన్ని నెలలు జైలు జీవితం అనుభవించి, కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక అధరాలు సేకరించారు. సేకరించిన ఆధారాలతో జానీ మాస్టర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు నార్సింగి పోలీసులు. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈవెంట్స్ పేరుతోటి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడులు చేసినట్టు కనుగొన్నారు.

Also Read : Mega Star : వింటేజ్ మెగాస్టార్ చిరు ఈజ్ బ్యాక్

ఎన్నో ఏళ్లుగా జానీ మాస్టర్ వద్ద నార్త్ కు చెందిన ఓ యువతి అసిస్టెంట్ గా పని చేస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో సాంగ్స్ కు ఆమె అసిస్టెంట్ గా పని చేసింది. సినిమాల షూటింగ్ నిమిత్తం ముంబై, బెంగుళూరు, చెన్నై వెళ్ళినపుడు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడని జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇప్పుడు ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడు జానీ మాస్టర్. కాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయడంపై అల్లు అర్జున్ పాత్ర ఉందని ఈ రోజు మీడియా జానీ మాస్టర్ ను ప్రశ్నించగా నో కామెంట్స్ అని బదులిస్తూ సమాధానం ఇచ్చాడు జానీ మాస్టర్. ఇక ఈ కేసులో కీలక అధరాలు లభించడంతో జానీ మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ చేయమని కోరేందుకు కోర్టుకు వెళ్లే ఆలోచనలలో ఉన్నారట పోలీసులు.

Show comments