NTV Telugu Site icon

Adipurush: తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి పర్మిషన్.. ఎంత పెంచుకోవచ్చంటే?

Adipurush Telangna Ticket Rate

Adipurush Telangna Ticket Rate

Telangana Permits hike for Adipurush single screen Tickets: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. రోజుల వ్యవధి మాత్రమే ఇంకా మిగిలి ఉంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం రఘురాముడిగా ప్రభాస్ కనిపించబోతూ ఉండటంతో మూవీ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయినప్పటికీ ఇప్పటికే నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం లోపు ఎప్పుడైనా బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.

Also Read: Sai Dharam tej: తీవ్ర విషాదంలో ధరమ్ తేజ్.. ఏమైందంటే?

ముందు యూవీ రిలీజ్ చేస్తుంది అనుకున్నా కుదరక పోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున సినిమాని రిలీజ్ చేస్తుంది. ఏపీలో ఇప్పటికే 25 నుంచి 50 రూపాయిలు అదనంగా టికెట్ రెట్లు పెంచుకుని అమ్ముకుంటామని అడిగితే సూత్రప్రాయంగా ఓకే చెప్పారు, జీవో కోసం వెయిటింగ్. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడమే కాదు జీవో కూడా రిలీజ్ చేసింది. జీవో ప్రకారం 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు టికెట్ రేట్ పెంచి అమ్ముకోవచ్చు. అలాగే తెల్లవారు జాము నాలుగు నుంచే షోలు వేసుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ధరల పెంపు ఆదిపురుష్ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశంగా కనిపిస్తోంది.

Show comments