Site icon NTV Telugu

Mega Blood Donation : మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో తేజ సజ్జా రక్తదానం..

Teja Sajja Donates Blood

Teja Sajja Donates Blood

మనుషుల జీవితాలను కాపాడే పుణ్య కార్యానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరోసారి మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి ప్రవేశపెట్టిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో ఈసారి యువ హీరో తేజ సజ్జా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తేజ సజ్జా, సంయుక్త మీనన్ హాజరవగా.. విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘రక్తదానం ఒక ప్రాణదానంలా భావించాలి. ఒక చుక్క రక్తం ప్రాణాన్ని కాపాడగలదు. మెగా ఫ్యామిలీ చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది’ అని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి రక్తదానం ప్రాముఖ్యతను వివరిస్తూ..

Also Read : Girls & Depression: అమ్మాయిలు ఎక్కువగా డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్లిపోతారు..? శాస్త్రం ఏం చెబుతోందంటే?

యువత అందరూ ముందుకొచ్చి, సమాజానికి సేవ చేయాలి. రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం గమనార్హం. చిరంజీవి వెల్‌ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్ దేశవ్యాప్తంగా మంచి స్పందనను పొందుతోంది. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు తేజ సజ్జా, సంయుక్త మీనన్, చిరంజీవిల సేవా మనోభావాన్ని అభినందిస్తున్నారు.

 

Exit mobile version