Site icon NTV Telugu

IIFF: ఉత్తమ నటుడుగా హీరో తేజ సజ్జా

Teja Sajja New Film

Teja Sajja New Film

Teja Sajja Bags Best Actor Award in Innovative International Film Festival: ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడుగా హనుమాన్ సూపర్ హీరో తేజ సజ్జా ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మకమైన “ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్”లో సూపర్ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. హనుమాన్ సినిమాలోని తేజ అద్భుతమైన నటన ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది. నిజానికి తేజ సజ్జ మొదట బాలనటుడిగా పరిశ్రమలో గుర్తింపు పొందాడు. అలా తేజ తన తొలి సినిమాకి నంది అవార్డు & ఫిల్మ్‌ఫేర్ గెలుచుకున్నాడు.

Prakash Raj: 1000 మంది ఆర్టిస్టులున్న సెట్ నుంచి ప్రకాష్ రాజ్ మిస్సింగ్.. కోటి రూపాయల నష్టం!

హను-మాన్‌లో తేజ చేసిన క్యారెక్టర్ అతని కెరీర్‌ నే ఒక పెద్ద మలుపు తిప్పింది. హను-మాన్‌లో సూపర్‌హీరోగా తేజ నటన అందరినీ కట్టిపడేసింది. హనుమాన్ కోసం తేజకు ఇది రెండవ ఉత్తమ నటుడి అవార్డు. హనుమాన్ మ‌రిన్ని అవార్డులు గెలుచుకునే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. హనుమాన్ సినిమా సంక్రాంతికి కాస్త ముందుగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 330 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం ఓటిటిలో చాలా ఆలస్యంగా వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తేజ సజ్జ హనుమాన్ నటించిన చిత్రం ఓటిటిలో చాలా రోజులుగా అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా నిలిచింది.

Exit mobile version