సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సాధారణ విషయమే. దాదాపు స్టార్ హీరోలందరి కుటుంబాల నుంచి వారసులు ఎంట్రీ ఇచ్చేశారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా “హీరో”తో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అశోక్ ను ఇప్పుడు ఆయన తండ్రి జయదేవ్ గల్లా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘హీరో’ మూవీ అతి త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
Read Also : దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’!
ఇటీవలే ఈ మూవీ టైటిల్ ను, టీజర్ ను ప్రిన్స్ మహేశ్ బాబు విడుదల చేశారు. ఇక ఈ “హీరో” టీజర్ విడుదలైన గంటల్లోనే రికార్డులు మోత మోగించాడు. “హీరో” టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవక ముందే 1 మిలియన్ భారీ వ్యూస్ తో తో రికార్డు క్రియేట్ చేసింది. ఒక కొత్త హీరో టైటిల్ టీజర్ కు అతికొద్ది సమయంలోనే ఇలా భారీ వ్యూస్ రావడం విశేషమే మరి. తాజాగా ‘హీరో’ టైటిల్ టీజర్ 4 మిలియన్ వ్యూస్ దాటేయడంతో చిత్రబృందం సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి టైటిల్ టీజర్ తోనే భక్తి బజ్ క్రియేట్ చేసిన “హీరో” రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
