Tasty Teja: ప్రియాంక జైన్ ఇంట్లో టేస్టీ తేజకు హార్ట్ ఎటాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tasty Teja Heart Attack Prank on Priyanka jain: జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తేజ. జబర్దస్త్ లో వచ్చిన క్రేజ్ తో పాటు అక్కడ కాంటాక్ట్స్ ఉపయోగించి టేస్టీ తేజ అనే ఒక ఫుడ్ వ్లాగ్గింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక యూట్యూబర్ అయ్యాడు. అయితే అక్కడ మనోడికి మంచి ఫాలోయింగ్ రావడంతో బిగ్ బాస్ సెవెన్ లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ 7 హౌస్ లోకి వెళ్ళాక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గర అయ్యాడు. బిగ్ బాస్ కప్పు కొట్టలేదు అలా అని ప్రైజ్ మనీ గెలవలేదు. కానీ రెమ్యూనరేషన్ తీసుకుని హ్యాపీగా బయటకు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ తో ఒక్కొక్క వీడియో ప్లాన్ చేస్తూ వెళుతున్నాడు. తాజాగా ప్రియాంక జైన్ ఇంట్లో ప్లాన్ చేసిన వీడియోలో హార్ట్ ఎటాక్ వచ్చి పడిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియోని ప్రియాంక జైన్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. అసలు విషయం ఏమిటంటే ప్రియాంక ఆమె ప్రియుడు శివకుమార్ ఇద్దరూ ఉన్న సమయంలో తేజను ఇంటికి ఆహ్వానించారు. అయితే ముందుగానే శివకుమార్ తేజతో ప్రియాంక మీద ఒక ప్రాంక్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
Anupama Parameswaran: పెళ్లి చేసుకున్న అనుపమ.. మంగళ సూత్రం చూపిస్తూ..
Also Read
అందులో భాగంగానే వంట మొదలుపెట్టిన తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని తేజ కింద పడిపోవడం కనిపిస్తోంది. అయితే అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అందరి ఫోన్లు శివకుమార్ దాచేస్తాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె బాగా టెన్షన్ పడిపోతున్న సమయంలో ఇది ప్రాంక్ అని చెప్పి ఆమెను చల్లబరిచే ప్రయత్నం చేశారు. కానీ ఆమె కోపంతో శివకుమార్ను చేయి చేసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. నిజానికి ఇది ముందుగానే ప్రాంక్ అని వీడియోలో డిస్ క్లైమర్ ఇచ్చారు. ఇక్కడ కేవలం ప్రియాంకకు మాత్రమే ప్రాంక్ అనే విషయం చెప్పలేదు. అయినా సరే యూట్యూబ్ ఫాలో అయ్యే వారికి ముందుగానే ఈ విషయం మొత్తం చెప్పినా సరే ఈ ప్రాంక్ తో ఎవడికి ఉపయోగం అనే కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంక్స్ కల్చర్ హద్దులు దాటి ముందుకు వెళుతుంది. ఒకానొక సమయంలో రోడ్డు మీద ఎవరైనా పడిపోతే వాళ్ళని రక్షించడానికి వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవడో ప్రాంక్ చేస్తున్నాడు, ఏ మూలనో కెమెరా పెట్టుకుని ఉంటారు అనుకుని దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదిగో పులి అనే కథలో చందంగా ఇప్పుడు చేస్తున్న ప్రాంక్స్ ను చూస్తే నిజంగా వారికి అదే పరిస్థితి ఎదురైనా సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఎదురవుతోంది. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!