Site icon NTV Telugu

Tarun : ఆరేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన డైరెక్టర్.. టీజర్ రిలీజ్

Housefull

Housefull

బాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరో అక్షయ్ కుమార్. బాక్సాఫీస్‌కు డొల్ల చిత్రాలిచ్చి బొక్కా బోర్లా పడ్డాడు. ఓ మైగాడ్ 2 తర్వాత ఈ ఖిలాడీ రూట్ మార్చడంతో కలెక్షన్లు కూడా రూట్ మార్చాయి. ఎంత సేపు క్రింజ్ కామెడీ ఏం చేస్తాంలే అని సీరియస్ యాక్షన్ డ్రామా, పీరియాడిక్ చిత్రాలకు షిఫ్ట్ అయితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సర్ఫిరా, స్కై ఫోర్స్, కేసరి 2 మంచి అటంప్ట్ చిత్రాలుగా మారాయి. కానీ గల్లాపెట్టేను నింపులేకపోయాయి. పెట్టిన బడ్జెట్ డబ్బులు రాబట్టుకోవడం కూడా కష్టమౌతోంది.

రీసెంట్లీ కేసరి చాప్టర్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు అక్షయ్. పీరియాడిక్ అండ్ కోర్టు డ్రామాగా వచ్చిన అప్లాజ్ తెచ్చుకుంది కానీ  వంద కోట్లు రాబట్టుకోవడానికి నానా అవస్థలు పడింది. లాస్ట్ సెవెన్ ఎక్స్ పరిమెంటల్ మూవీస్ అక్షయ్ మార్కెట్‌ను గట్టిగానే దెబ్బతీశాయి. మంచి ఫిల్మ్స్ చేస్తే చెప్పుకోవడానికే కానీ ప్రొడ్యూసర్లకు, తనకు మేలు చేయవని త్వరగానే గ్రహించిన బాలీవుడ్ స్టార్ హీరో మళ్లీ ఓల్డ్ ఫార్ముట్ లోకి వచ్చేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన కామెడీ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.ఇండియన్ సినీ చరిత్రలో వన్ అండ్ ఓన్లీ కామెడీ ఫ్రాంచైజీ హౌస్ ఫుల్. ఇప్పుడు ఈ వెంచర్ నుండి ఫిఫ్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీ రాబోతుంది. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ టీజర్‌లో జస్ట్ కాస్ట్‌ను ఇంట్రడ్యూస్ చేసింది యూనిట్. భారీ కాస్టింగ్‌ను సిద్ధం చేసింది.   అక్షయ్, రితేశ్, చుంకీ పాండేతో పాటు అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్, జాకీ ష్రాఫ్ మరోసారి రిటర్న్ అయ్యారు. ఇందులోకి కొత్తగా సంజయ్ దత్, నానా పటేకర్‌ను పట్టుకొచ్చాడు నిర్మాత సాజిద్ నడియాద్ వాలా.  జూన్ 6న థియేటర్లలో రిలీజౌతున్నఈ క్రింజ్ కామెడీతో అక్షయ్ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో వెయిట్ అండ్ వాచ్.

Also Read : Suriya : రెట్రో ఫస్ట్ డే ఫస్ట్ షో.. రివ్యూ

Exit mobile version