యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో కనిపించనుండగా, నితిన్ పాత్రలో ఓ డిఫరెంట్ షేడ్స్ తో పాటుగా అతని నటనలో కొత్త కోణాలను చూపించనున్నాడట. ఇక తాజాగా మ్యూజికల్ ప్రమోషన్ పరంగా మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.
Also Read : ENE 2 update : ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌కు ముహూర్తం ఫిక్స్!
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకోగా, ఇప్పుడు సెకండ్ సింగిల్‌పై ఆసక్తిని పెంచుతూ మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ పాట జూలై 4న విడుదల కానుంది. దీనితో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక ‘తమ్ముడు’ సినిమాకు ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ అపిల్ కూడా ఉండబోతోంది. ప్రత్యేకించి ఎం.ఎస్. రాజు స్టైల్ నరేషన్ తో దర్శకుడు శ్రీరామ్ వేణు హ్యాండిల్ చేసిన తీరుపై ఆసక్తి నెలకొంది. కుటుంబ విలువలు, బంధాలు, తమ్ముడు పాత్ర ప్రయాణం వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. ఈ సెకండ్ సింగిల్‌తో మరింత హైప్ తెచ్చేలా మ్యూజిక్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ సినిమా, నితిన్‌కు హిట్ అందిస్తుందా లేదా చూడాలి.
