Site icon NTV Telugu

సోనూసూద్ పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్

Tammareddy Bharadwaj Shocking Comments on Sonu Sood

వెండితెర విలన్, రియల్ లైఫ్ హీరో సోనూసూద్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో దేవుడిగా మారారు. గత ఏడాది నుంచి ఇండియాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు సోనూ. ఈ కష్టకాలంలో బెడ్స్, ఇంజెక్షన్స్, మందులు వంటివి కరోనా బాధితులకు సూపర్ హీరోలా సూపర్ ఫాస్ట్ గా అందిస్తూ సూపర్ మ్యాన్ అయ్యాడు. అలాంటి సోనూసూద్ పై తాజాగా సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ ఛానెల్ లో జరిగిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి తనకు నాలుగైదు సంవత్సరాల క్రితం సోనుతో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. వికలాంగుల కోసం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి సోనూసూద్ ను విచ్చేయవలసిందిగా ఆహ్వానం తమ్మారెడ్డి సంప్రదించారట. కానీ సోనూ దానికి డబ్బు చెల్లించాలని అడిగాడట. దీంతో సోనూసూద్ చాలా కమర్షియల్ అనే ఒక ఒపీనియన్ వచ్చిందని, కానీ ఇప్పుడు చూస్తే సోనూ దేవుడిలా కన్పిస్తున్నాడని, ఆయన చేస్తున్న సేవలు చూస్తుంటే తన అభిప్రాయం మారిపోయిందని చెప్పుకొచ్చారు. తమ్మారెడ్డి ఇప్పుడు వేరే సోనూసూద్ ను చూస్తున్నానని, అతను ప్రజలకు సహాయం చేయడానికి తన ఆస్తుల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడని అన్నారు.

Exit mobile version