కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 ను హోంబాలే ఫిల్మ్స్ భారి బడ్జెట్ పై నిర్మించింది. దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా రూ. 500 కోట్ల మార్క్ ను దాటి భారీ వసూళ్లు రాబట్టి దూసుకెళ్తోంది.
Also Read : Yellamma : ‘ఎల్లమ్మ’ నుండి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్
అయితే కాంతార చాఫ్టర్ 1 చూసేందుకు తమిళ స్టార్ దర్శకుడు చాలా కష్టపడ్డాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అట్లీ. అల్లు అర్జున్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న అట్లీ పికిల్ బాల్ జట్టు బెంగళూరుజవాన్స్ ను కొనుగోలు చేసాడు. తన జట్టు తొలి ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడుతూ ‘ కాంతారాచాప్టర్ 1 విడుదలైనప్పుడు నేను అంష్ట్రడాంల ఉన్నాను. ఆ సినిమా చూడటానికి సుమారు 150 కిలోమీటర్స్ 2.5 గంటలు పాటు ప్రయాణించాను. సినిమా చుసిన వెంటనే నేను రిషబ్ శెట్టికి ఫోన్ చేసాను.ఒక దర్శకుడిగా హీరోగా రిషబ్ శెట్టి అద్భుతంగా చేసారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ ఎందరో యంగ్ డైరెక్టర్స్ కు ఇన్స్పిరేషన్. కాంతారను రిషబ్ శెట్టి అద్భుతంగా తెరకెక్కించారుబ్. ఈ సినిమాకు రిషబ్ జాతీయ అవార్డు గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
