తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఒక డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నిజానికి, శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ అనే నటుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి ద్వారా కొంత సమాచారం తెలియడంతో, ఈ కేసులో కృష్ణ అనే మరో నటుడిని కూడా ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు కూడా డ్రగ్స్ వాడినట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది.
Also Read: Raashi Khanna : టాప్ లెస్ ట్రీట్ ఇస్తున్న రాశిఖన్నా..
ఈ రోజు ఉదయం నుంచి అతడిని పోలీసులు విచారిస్తుండగా, కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని కృష్ణ వెల్లడించినట్లు చెబుతున్నారు. శ్రీరామ్ తన స్నేహితుడు మాత్రమేనని, 2018 నుంచి తాను తీవ్రమైన అలర్జీతో బాధపడుతున్నానని, డ్రగ్స్ వాడే అవకాశం లేదని అతడు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Chiranjeevi- Nagarjuna : చిరు-నాగ్ కాంబోలో మల్టీస్టారర్.. అలా మిస్ అయింది..
అలాగే, తనను అరెస్టు చేసినట్లు ప్రచారం జరగడంపై కూడా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను న్యాయవాదులకు, పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణలో భాగంగా కృష్ణ రక్త నమూనాలను పోలీసులు సేకరించారు. వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
