Site icon NTV Telugu

Karthi : క్షమాపణలు తెలిపిన తమిళ హీరో కార్తీ.. పూర్తి వివరాలు ఇవే..

Untitled Design (8)

Untitled Design (8)

శ్రీవారి లడ్డూ పై వివాదాలు నడుస్తున్న తరుణంలో సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. ఇంతకీ కార్తీ ఆ ఈవెంట్లో ఏమన్నాడు అంటే ‘ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ టాపిక్ , మనకి వద్దు  లడ్డూ , అసలు  లడ్డూ గురించే టాపిక్ వద్దు’ అని అన్నాడు.

కాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం ఘాటుగా స్పందించారు. ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “సినిమా నటులపై కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ ఏమన్నారంటే ”  సినిమా వాళ్లకి చెప్తున్నాను. మీరు మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మీ మీ మాధ్యమాల అపహేళన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఇది డీప్ పైన్. సినీ ఇండస్ట్రీలో కొందరు లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు.. అపహాస్యం చేస్తే ప్రజలు మిమల్ని క్షమించరు” అని అన్నారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు తమిళ హీరో కార్తీ  ” ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు ఎంతో గౌర‌వం, అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వరు స్వామి భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను ” అని ట్వీట్ చేసాడు కార్తీ

Capture

Exit mobile version