Site icon NTV Telugu

Exclusive : ఎన్టీఆర్ తో కాదు.. రామ్ చరణ్ తో తమిళ డైరెక్టర్ సినిమా ఫిక్స్

Rc 17

Rc 17

బీస్ట్, జైలర్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్‌ స్టార్ డైరెక్టర్ గా మరాడు. అయితే నెల్సన్ నెక్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. అటు ఎన్టీఆర్ కూడా నెల్సన్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని  టాక్ వినిపించింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అటు నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎన్టీఆర్, నెల్సన్ సినిమాను సితార నాగవంశి నిర్మిస్తాడని కూడా ఉహాగానాలు వినిపించాయి.

Also Read : AKT : ఆంధ్ర కింగ్ తాలూకా నెక్ట్స్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

కానీ ఇప్పుడు ఈ ప్లాన్ మారింది. జైలర్2 తర్వాత, దర్శకుడు నెల్సన్ తదుపరి చిత్రం మరో హీరోతో ఖరారైనట్లు తెలుస్తోంది. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం రజనీకాంత్ తో మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ముందుగా భావించారు. అయితే,  నెల్సన్ తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని అందులోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇటీవల ఒక బౌండ్ స్క్రిప్ట్ ను రామ్ చరణ్ కు అందించాడని, ఆ స్క్రిప్ట్ చరణ్ కు బాగా నచ్చిందని కూడా తెలిసింది. ఫైనల్ గా చరణ్ కు మరొక వెర్షన్ నరేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ను లాక్ చేయబోతున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్  నిర్మించబోతోంది.

Exit mobile version