Site icon NTV Telugu

ప్రముఖ తమిళ నటుడు వెంకట్ సుభా కన్నుమూత

Tamil Actor Venkat Subha dies of Covid-19

కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత, రచయిత వెంకట్ సుభాను కరోనా బలి తీసుకుంది. మే 29న తెల్లవారుజామున 12.48 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది వెంకట్ సుభాకు. చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు మార్చారు. అయితే మే 29 న తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. అతని సన్నిహితుడు, నిర్మాత అమ్మ క్రియేషన్స్ అధినేత టి శివా ఈ విచారకరమైన వార్తను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన రాధికా శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Exit mobile version