Site icon NTV Telugu

Odela 2: ‘ఓదెల 2’ ట్రైలర్… గూస్‌బంప్స్ మెటీరియల్

Odela 2

Odela 2

కరోనా టైంలో హెబ్బా పటేల్‌తో సంపత్ నంది టీం చేసిన “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా “ఓదెల 2” అనే సినిమా చేశారు. తమన్నా ప్రధాన పాత్రధారిగా చేసి ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే సినిమాకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక ఇప్పుడు తాజాగా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేసి ట్రైలర్ రిలీజ్ ముంబైలో చేశారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉందనేది ఇప్పుడు పరిశీలిస్తే, నాగ సాధువు -శివశక్తిగా మారిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డైలాగ్స్ ఒక రేంజ్‌లో కనిపిస్తోంది. “మనం నిలబడాలంటే భూమాత, బతకాలంటే గోమాత మీరు బతకడం కోసం వాటిని చంపక్కర్లేదు. వాటి వాటి ఉచ్చ అమ్ముకున్నా బతకచ్చు” అనే డైలాగ్ అయితే హిందూ వర్గాల వారికి ట్రీట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్, సప్త మోక్షాలలో సాధన చేసిన దానితో సవాల్ వద్దు సైతాన్” అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ గూస్‌బంప్స్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఈ కంటెంట్ చూస్తుంటే థియేటర్లలో నడిచే సినిమాలాగే అనిపిస్తుంది.

Chiranjeevi: పవన్ కళ్యాణ్ కొడుకు కోసం సింగపూర్ కి చిరంజీవి దంపతులు!

ఇక ట్రైలర్‌ను బట్టి చూస్తే, “ఓదెల రైల్వే స్టేషన్” సినిమా చివరిలో వశిష్టను అతని భార్య హెబ్బా పటేల్ చంపేస్తుంది. ఆమె జైలు పాలైన తర్వాత అతను ఆత్మగా మారి, ఊరందరి మీద పగ, ప్రతీకారాలు పెంచుకొని వారందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు. హెబ్బా పటేల్ సోదరి తమన్నా శివశక్తిగా ఎప్పుడో మారుతుంది. ఊరికి ఇబ్బంది అని తెలిసి, ఆ ఇబ్బందిని దూరం చేయడానికి ఆమె తిరిగి వస్తుంది. కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా థియేటర్ మెటీరియల్ అని అనిపిస్తోంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో కూడా కేర్ తీసుకున్నారు. ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో ఈ సినిమా తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.

Exit mobile version