Site icon NTV Telugu

Tamannaah : తమన్నా చెప్పిన లాలాజల చిట్కా‌పై హాట్ డిబేట్ – డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?

Thamannah (2)

Thamannah (2)

భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో తన అందంతో, స్కిన్ గ్లో తో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ తమన్నా భాటియా. మిల్క్ బ్యూటి‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ స్కిన్ కేర్ చిట్కాతో వార్తల్లో నిలిచింది. మొటిమల నివారణ కోసం తమన్నా చెప్పిన ‘లాలాజల’ టిప్ వైరల్ అవుతోంది. అయితే ఈ చిట్కా విన్నవారిలో కొందరు ఆశ్చర్యానికి గురవుతుం‌టే.. మరికొందరు అయోమయానికి లోనవుతున్నారు. తాజాగా డాక్టర్లు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకి తమన్నా చెప్పిన వింత చిట్కా ఏటం‌టే..

Also Read : Jaaran : ఓటీటీలోకి అడుగుపెడుతున్న బ్లాక్ మ్యాజిక్, శాపాల ముడిపడిన ‘జారన్’..

తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తమన్నా.. ‘ఉదయం లేచి మొటిమలపై లాలాజలం (ఉమ్మి) రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది’ అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది. ఇది వినగానే పక్కన ఉన్నవారు ఆశ్చర్యపోయిన.. తమన్నా మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా, ఇది నిజంగానే పనిచేస్తుందని చెప్పింది. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించమని కూడా సూచించింది. అయితే తాజాగా డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఈ టిప్‌పై బలమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. ఒకరికి పనిచేసిన టిప్, మరొకరికి హానికరం గా మారవచ్చు. ముఖ్యంగా చర్మ సమస్యలు అంటే చిన్నవి కావు. లాలాజలం తో మొటిమలు తగ్గుతాయన్న‌ది పూర్తిగా అపోహ. నిజానికి లాలాజలం వాడటం వల్ల చర్మానికి ముప్పు ఎక్కువ. మన నోటిలో అనేక రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయి. అవి చర్మంపై కి వెళ్లినపుడు మొటిమలు మరింత పెరగడమే కాకుండా, ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంది. లాలాజలంలో ఉన్న ఎన్జైమ్స్‌ వల్ల చర్మానికి దద్దుర్లు, ఎర్రదనం వంటి ప్రతికూల ప్రభావాలు రావచ్చు. చర్మానికి సహజంగా ఉండే పిహెచ్ స్థాయిని లాలాజలం మార్చివేసి, చర్మాన్ని మరింత హీనంగా చేస్తుంది’ అని పేర్కొన్నారు.

Exit mobile version