Site icon NTV Telugu

Tamannaah : నయనతార, రష్మిక‌ల బాటలో తమన్నా – కొత్త వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్

Thamannah

Thamannah

ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వారి సినిమా పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా కొన్ని వ్యాపారాలు కూడా చేపడుతున్నారు. వారి సంపాదనను మరింత పెంచుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు టాప్ హీరోయి‌న్లు నయనతార ఒక ప్రసిద్ధ కాస్మొటిక్స్ బ్రాండ్‌ను ప్రారంభించి విజయవంతంగా నడుపుతుండగా. రష్మిక మందన్నా కూడా తన పేరుతో ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను లాంచ్ చేసి, ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తోంది. రకుల్, అలియా ఇలా ప్రతి ఒక్క హీరోయిన్ ఏదో ఓ వ్యాపారం మొదలెడుతున్నారు ఇక ఇప్పుడు అదే దారిలో తమన్నా కూడా అడుగేస్తోం‌ది.

తాజాగా తమన్నా కొన్ని ఫొటోల‌ను షేర్ చేస్తూ తన కొత్త వ్యాపార ప్రాజెక్టుకు సంబంధించి ఓ హింట్ ఇచ్చింది. అల్‌రెడి ఆమె జ్యూవెలరీ రంగంలో తన తండ్రి సహకారంతో కొన్ని ఔట్‌లెట్లలో పెట్టుబడులు పెట్టింది. ఇక ఇప్పుడు మరొక కొత్త రంగంలో అడుగు పెడతానం‌టూ సంకేతాలిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు, టీజర్లు చూస్తుంటే ఇది బ్యూటీ, ఫ్యాషన్ లేదా హెల్త్-వెల్‌నెస్ రంగాల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తానికి, నయనతార, రష్మిక‌లు తమ బ్రాండ్లతో మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న తరుణంలో, తమన్నా కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తూ తన పేరుతో ప్రత్యేకమైన బ్రాండ్‌ను స్థాపించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక తమన్నా  బిజినెస్ వెంచర్‌తో పాటు, సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఇటు ఓటీటీ ప్రాజెక్టులు, అటూ స్టార్ హీరోలతో  స్పేషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంది.

Exit mobile version